పోలవరం అంటేనే ప్రజలకు సెంటిమెంట్. గోదావరి, కృష్ణా నదుల్లో నీరున్నా కొంత వృధాగా సముద్రంలోకి పోతోంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఇబ్బందులకు గురి అయ్యింది. విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ముంపు మండలాలు ఏపీకి ఇవ్వలేదు. అనంతరం కేంద్రంతో చర్చించి ముంపు మండలాలు సాధించుకున్నాం. 28 సార్లు క్షేత్ర స్థాయికి వెళ్లా, 82 సార్లు వర్చువల్ గా సమీక్ష చేశాను. 2019 వరకూ పోలవరం 72 శాతం పని పూర్తి చేశాం. కాంక్రీటు పనులు, డయాఫ్రమ్ వాల్ పనులు, స్పిల్ వే, కాఫర్ డ్యాంలు కూడా నిర్మించాం. రూ.4,114 కోట్లను అప్పటికే పునరావాసం కోసం ఖర్చు చేశాం. 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి ఆ ప్రాజెక్టు పాలిట శనిలా దాపురించింది” – సీఎం చంద్రబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here