నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్‌ 1న  హైదరాబాద్‌ హైటెక్స్‌ నోవోటెల్‌ హోటల్‌లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ని ప్లాన్‌ చేశారు. తమిళ్‌ మలయాళ, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్‌ హీరో శివరాజ్‌కుమార్‌, హీరో విజయసేతుపతి, హీరో శివకార్తికేయన్‌, హీరో కిచ్చా సుదీప్‌, హీరో దునియా విజయ్‌, దర్శకులు పి.వాసు, యాక్టర్‌ నాజర్‌,  నిర్మాత రాక్‌ లైన్‌ వెంకటేష్‌, హీరోయిన్లు సుహాసిని, మీనా, మాలాశ్రీ, సుమలతగార్లను,  రవి  కొత్తర్కర (ఎస్‌ ఐ ఎఫ్‌ సి సి మరియు ఎఫ్‌ ఎఫ్‌ ఐ ప్రెసిడెంట్‌), కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ మరియు సెక్రటరీ హరీష్‌ మరియు ఆఫీస్‌ బేరర్స్‌ను కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హానరబుల్‌ సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌, సీనియర్‌ ప్రొడ్యూసర్‌ సి. కళ్యాణ్‌ ఆహ్వానించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here