భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని నటి కుట్టి పద్మిని(kutty padmini)తెలుగు,తమిళ, కన్నడ,హిందీ భాషల్లో సుమారు ఎనభై చిత్రాల దాకా చేసింది. అదే విధంగా అరవై సీరియల్స్ దాకా నిర్మించడం తో పాటు  కొన్నిటికి  దర్శకత్వం కూడా వహించింది.మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులపై లైంగిక ఆరోపణలు  జరుగుతున్నాయని హేమ కమిటీ నిర్దారించిన వేళ కుట్టి పద్మిని చేసిన తాజా వ్యాఖ్యలతో  ఇప్పుడు సరికొత్త డిమాండ్స్ తెరమీదకి వస్తున్నాయి.

 ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కుట్టి పద్మిని మాట్లాడుతు తమిళ టివి ఇండస్ట్రీ లోని  నటీమణులకి సైతం   లైంగిక వేధింపులు తప్పడం లేదు. పని ప్రదేశాల్లో వారికి రక్షణ కరువయ్యింది. డాక్టర్ లాయర్ మాదిరిగానే నటి నటులుగా రాణించడం ఒక ప్రొఫెషన్.ఈ రంగంలోని మహిళలు ఎంతో  మంది వల్ల వేధింపులకి గురవ్వుతున్నారు.ఇది నిజంగా బాధాకరం అని చెప్పడమే కాకుండా మరికొన్ని సంచలన విషయాలని చెప్పుకొచ్చింది. దర్శకులు, టెక్నీషియన్స్ తమ ఫేవర్స్ తీర్చమని నటీమణులని అడుగుతుంటారు.దాంతో ఎవరకి  ఫిర్యాదు చెయ్యాలో తెలియక  తమలో తామే బాధపడుతుంటారు. ఎందుకంటే ఫిర్యాదు చేసినా కూడా  నిరూపితం కాదు. వారి చేష్టలు సహించిన వారు మాత్రమే ఇక్కడ రాణించగలుగుతారు. అంతే కాకుండా కొంత మంది నటీమణులు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డారు.అందుకే  వారి సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపింది.ఇప్పుడు ఈ విషయం ఇండియన్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక కుట్టి పద్మిని కి మద్దతుగా ప్రముఖ నటి సనమ్ శెట్టి కూడా రంగంలోకి దిగి తమిళ  సీమలో నటీమణుల పై లైంగిక దాడులు జరుగుతున్నాయని చెప్పింది. హీరో విశాల్(vishal)కూడా మాట్లాడుతు త్వరలోనే ఒక కమిటీ ని వేసే ఆలోచనలో ఉన్నామని చెప్పాడు. మొత్తం పది మంది సభ్యులు అందులో ఉంటారని కూడా ఆయన చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here