రోటి పచ్చళ్లంటే రోట్లో దంచి చేసేవి. ఇప్పుడు ఆ వీలు చాలా కొద్దిమందికే ఉంటుంది. కానీ వాటి రుచే వేరు. మిక్సీలోనూ అదే రుచిలో రోటి పచ్చళ్లు చేసేయొచ్చు. ఒకసారి బీరకాయ, టమాటా కలిపి ఇలా పచ్చడి చేసి చూడండి. ఇంకేం కూర అక్కర్లేకుండా దీంతోనే తినేస్తారు. రోలు ఉంటే మాత్రం ఈ పచ్చడి తయారీ కోసం దాన్నే వాడండి.