యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ దేవర(devara)పైగా ఆర్ఆర్ఆర్(rrr)వచ్చిన రెండున్నర ఏళ్ళ తర్వాత వస్తుండంతో దేవర మీద పాన్ ఇండియా లెవల్లోనే క్రేజ్ ఉంది.ఇప్పటికే చాలా ఏరియాల్లో మిడ్ నైట్ షోస్ కి సంబంధించిన టికెట్స్ అయిపోయాయనే వార్తలు  కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. మరికొన్ని రోజుల్లో ఆ సందడి మరింత ఎక్కువ కాబోతుంది. 

ఎన్టీఆర్ ప్రస్తుతం తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కర్ణాటక లో ఉన్నాడు. తల్లి షాలిని అక్కడి ఆమెనే  కావడంతో  ఆలయాల సందర్శన చేస్తు బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పిక్స్ కూడా దర్శనం  ఇస్తున్నాయి.ఇక ఎన్టీఆర్ అక్కడ్నుంచి రావడం రావడంతోనే దేవర ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. ఈ నెల రెండో వారం నుంచి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని ప్లాన్ చెయ్యబోతుందని తెలుస్తుంది. ముందుగా హిందీలో కొన్ని ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారంట, అనంతరం తమిళ, కన్నడ ,తెలుగులో వరుసగా ఈవెంట్స్  ఉండబోతున్నాయనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.పైగా ఇంతవరకు ఎవరు నిర్వహించని రీతిలో ఆ ఈవెంట్స్ ఉండబోతున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.

సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న దేవర  ప్రెజంట్  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్(Janhvi Kapoor)జత కట్టగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్(saif ali khan)ఫస్ట్ టైం విలన్ గా చేస్తున్నాడు.మిగతా ముఖ్య పాత్రల్లో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మెరవబోతున్నారు. అనిరుధ్  సంగీత సారధ్యంలో ఇప్పటికే వచ్చిన రెండు పాటలు రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతున్నాయి. కొరటాల శివ(koratala siva)దర్శకుడు కాగా రెండు భాగాలుగా దేవర  తెరకెక్కబోతుంది.సెకండ్ పార్ట్ అప్ డేట్ గురించి  ప్రమోషన్స్ లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here