Ubit Crypto Scam : బడిని గుడిగా మార్చి నాలుగు గోడల మధ్య పిల్లల జీవితాలను తీర్చిదిద్దిన గురువులను చూసాము. ప్రత్యేకశ్రద్ధ పెట్టి పాఠాలు చెబుతున్న వాళ్లను చూసాము, తమ విధులకు న్యాయం చేస్తూ కేవలం తమను నమ్ముకుని సర్కారు బడులకు వచ్చే విద్యార్థుల ఆశలను నిలబెడుతున్న వారిని సైతం చూసాము. కానీ ప్రస్తుతం కొందరు గురువులు మాత్రం ‘కాయిన్స్’ వేటలో, కాసుల కక్కు ర్తిలో పడి తమ వృత్తికే మచ్చ తెచ్చి కటకటాలపాలైన వారిని చూడాల్సి వస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. పాఠాలు చెప్పడం మరిచి.. బడికి రాకుండానే గడిపేస్తున్నారని, తరగతి గదిలో ఎదురుగా ఉన్న విద్యార్థులను పట్టించుకోకుండా.. ఎక్కడో ఉన్నవాళ్లతో సెల్ఫోన్లో బిజినెస్, ఆన్లైన్ లో పెట్టుబడులు, సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.