తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు నాగార్జున( Actor Nagarjuna )… ప్రస్తుతం నాగార్జున తనదైన రీతిలో సినిమాలను చేయడానికి సంకల్పించుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆయన ధనుష్( Dhanush ) హీరోగా వస్తున్న ‘కుబేర’ సినిమాలో( Kubera ) ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటుగా రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాలో కూడా విలన్ గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు.మరి రజనీకాంత్( Rajinikanth ) ను ఢీకొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ విషయం లో ఏమాత్రం మిస్టేక్ జరిగిన కూడా నాగార్జున ఇమేజ్ అనేది భారీగా డ్యామేజ్ అవుతుంది.
కాబట్టి విలన్ పాత్రలో చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని ఇస్తే నాగార్జున ఇండస్ట్రీలో ఒక మైలు రాయిని అందుకున్న వాడు అవుతాడు.కాబట్టి కొంచెం జాగ్రత్తగా తను ఆ క్యారెక్టర్ లో నటిస్తే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పటికే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రజనీకాంత్ గత సంవత్సరం జైలర్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలతో సైతం పోటీపడే విధంగా జైలర్ సినిమాతో 400 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టి తనకు తానే సాటి అనేంతలా గుర్తింపు ను అయితే సంపాదించుకున్నాడు… చూడాలి మరి నాగార్జున ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడు అనేది…
.