తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇంతకుముందు హీరోగా నటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ( Shivaji ), తెలుగులో గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ షో తో ట్రెండింగ్ లోకి వచ్చారు.

 Hero Shivaji Plans To Entry Tv Shows As Judge, Bigg Boss Shivaji, Entry, Tv Show-TeluguStop.com

ఈ బిగ్ బాస్ షో తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు శివాజీ అదే ఊపుతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇక బిగ్ బాస్ షో తర్వాత చేసిన 90sవెబ్ సిరీస్( 90s web series ) అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ ఈ వెబ్ సిరీస్ ఓటీటీల్లో రికార్డులు క్రియేట్ చేసింది.

తెలుగు వారందరినీ ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్‌తో శివాజీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.అలాంటి శివాజీ ప్రస్తుతం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.వెండితెర, ఓటీటీ అంటూ సక్సెస్ సాధించిన శివాజీ ఇప్పుడు బుల్లితెరపై కొత్త అవతరాన్ని ఎత్తబోతోన్నారు.

ఈటీవీలో వచ్చే వినోద కార్యక్రమానికి జడ్జ్‌గా ట్రెండింగ్ రాబోతోన్నారట.అయితే ఏ షోకు న్యాయ నిర్ణేతగా రాబోతోన్నారని మాత్రం తెలియడం లేదు.

ప్రస్తుతం ఈటీవీలో బోలెడన్ని ఎంటర్టైన్మెంట్ షోలు వస్తోన్న సంగతి తెలిసిందే.మరి ఈ షోలలో ఏ షోకి న్యాయం నిర్ణేతగా వస్తారు అన్న విషయం మాత్రం తెలియడం లేదు.

ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటుడిగా నటిస్తూనే ఇప్పుడు జడ్జిగా అవతారం ఎత్తడానికి సిద్ధమవుతున్నారు శివాజీ.ప్రతీ సోమవారం రాత్రి గం.9.30 ని.లకు పాడుతా తీయగా అనే కార్యక్రమం వస్తుంది.బుధవారం, గురువారం ఢీ వస్తుంది.

శుక్రవారం, శనివారం జబర్దస్త్ షోలు వస్తున్నాయి.మరి వీటిల్లో శివాజీ ఏ షోకు గెస్టుగా వచ్చి ఆడియెన్స్‌ ను అలరిస్తారో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here