సిల్వర్‌ స్క్రీన్‌ మీద హీరోయిన్‌గా మెరవాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్‌ ఉండాలి. గతంలో అయితే అందం, అభినయం ఉంటే సరిపోయేది. ప్రజెంట్‌ జనరేషన్‌లో అవి రెండే కాదు, ఇంకా చాలా లక్షణాలు ఉంటేనే తప్ప హీరోయిన్‌గా నెగ్గుకు రాలేరు. ఒకప్పుడు హీరోయిన్లు అంటే పదేళ్ళు, ఇరవై ఏళ్ళు.. ఇలా ఏళ్ళ తరబడి సినిమాలు చేస్తూనే ఉండేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లకు ఆహ్వానం పలుకుతున్నారు ప్రేక్షకులు. దానికి తగ్గట్టుగానే కొత్తగా వచ్చే హీరోయిన్లు కొన్ని సినిమాలు చేసి పక్కకు వెళ్లిపోతున్నారు. ఉన్న నాలుగు రోజులు.. నాలుగు రాళ్ళు వెనకేసుకునేందుకు చాలా విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు. అలాగని అన్ని సినిమాలూ ఒప్పుకోకుండా సెలెక్టివ్‌గా ఉంటూ, తమకు ఉపయోగ పడే సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నారు. అలా కాకుండా ఏ సినిమాకైనా సైన్‌ చేసేస్తూ తన భవిష్యతును తానే పాడు చేసుకుంటున్న హీరోయిన్‌ ఒకరున్నారు. ఆమే మీనాక్షి చౌదరి. 

2019లో అప్‌స్టార్ట్స్‌ అనే హిందీ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చెయ్యడం ద్వారా చిత్ర రంగంలోకి ప్రవేశించింది మీనాక్షి. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మంచి హైట్‌తోపాటు స్క్రీన్‌ ప్రజెన్స్‌ కూడా బాగుండడంతో రవితేజ ఖిలాడి చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాతో ఒక రేంజ్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే దాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు. కాంబినేషన్‌ సినిమాల గురించి ఆలోచించింది తప్ప అందులో తన క్యారెక్టర్‌కి వున్న ఇంపార్టెన్స్‌ ఏమిటి అనేది పట్టించుకోలేదు. ఫలితంగా ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్టు కూడా చెయ్యని పాత్రలు చేసింది. గుంటూరు కారం చిత్రం ఆమెకు పెద్ద మైనస్‌ అయింది. ఆ సినిమా ఆమె కెరీర్‌ని పెద్ద దెబ్బతీసిందని చెప్పాలి. తాజాగా విజయ్‌ సినిమా గోట్‌లో కూడా అదే పరిస్థితి. కొన్ని సీన్స్‌లో, ఒక పాటలో మాత్రమే కనిపిస్తుంది. 

మిస్‌ ఇండియా కిరీటాన్ని ధరించిన తర్వాతే ఇండస్ట్రీకి వచ్చింది మీనాక్షి. అంతేకాదు, ఆమె స్టేట్‌ లెవన్‌ స్విమ్మర్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కూడా. ఇవన్నీ పక్కన పెడితే మీనాక్షి డెంటర్‌ సర్జరీలో బ్యాచ్‌లర్‌ డిగ్రీ హోల్డర్‌. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, హుషారైన ముఖం ఆమెకు ప్లస్‌ పాయింట్స్‌గా నిలుస్తాయి. ఖిలాడి చిత్రం తర్వాత వచ్చిన ఆఫర్స్‌లో బెస్ట్‌ సెలక్ట్‌ చేసుకొని ఉంటే ఈపాటికి హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉండేది. డెసిషన్‌ మేకింగ్‌లో రాంగ్‌ స్టెప్స్‌ వేయడం వల్ల ఆమె కెరీర్‌ వేగం పుంజుకోలేకపోయింది. ప్రస్తుతం లక్కీ భాస్కర్‌, మెకానిక్‌ రాకీ, విశ్వంభర, మట్కా చిత్రాల్లో నటిస్తోంది. ఈ నాలుగు చిత్రాల ఎంపిక విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకుందో లేదో అవి రిలీజ్‌ అయితేనే గానీ తెలీదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here