నల్లగొండ జిల్లా:2019 లో ఆర్టీసీ సమ్మె ( RTC strike)కాలంలో పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2019 లో ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి కేసులో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా కోర్టుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయీలను వెంటనే చెల్లించాలని,అనేక రకాల డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు ఆనాడు సమ్మెకు దిగడం జరిగిందన్నారు.సుమారుగా 52 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగిందన్నారు.

 Illegal Cases Should Be Removed During Rtc Strike Period ,illegal Cases , Rtc-TeluguStop.com

ఆనాటి బారాస ప్రభుత్వం సమ్మెను తీవ్రంగా అణిచి వేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా,యువజన సంఘాలుగా,వామపక్ష పార్టీలుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడం జరిగిందన్నారు.

ఈ సందర్భంలో వందలాది అక్రమ కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులపై,ప్రజాసంఘాల నాయకులపై, యువజన సంఘాల నేతలపై బనాయించడం జరిగిందన్నారు.

ఇదే సందర్భంలో నల్లగొండ జిల్లాలో అనేకమందిపై అక్రమ కేసులను పెట్టడం జరిగిందన్నారు.ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

సమ్మె హక్కును గౌరవించాలని, అదేవిధంగా ఆర్టీసీ సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులు పెట్టిన డిమాండ్లను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు.ఈ ఆర్టీసీ సమ్మే కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన వారి లో దండంపల్లి సత్తయ్య, ఏసోబ్,వీరా నాయక్, కొండేటి మురళి, రామలింగయ్య,కిరణ్, నవీన్ తదితరులు ఉన్నారు

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here