దేవర(devara)రాక కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో, ప్రేక్షకులు కూడా అంతే ఆశగా ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 27 దగ్గర కొచ్చే కొద్దీ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని చూస్తామా అనే ఉత్సుహత కూడా పెరిగిపోతుంది. మరి వాళ్ళందరి కోసం వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ పడబోతున్నాయి. 

 దేవర కి సంబంధించి  రెండు తెలుగు రాష్ట్రాల హక్కులని సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత నాగవంశీ  కైవసం చేస్తున్నాడు. దీంతో చాలా ఏరియాల్లో భారీ ఎత్తున ప్రీమియర్స్ పడేలా ప్లాన్ చెయ్యడంతో పాటుగా, ఓవర్ సీస్, ఏపీ,తెలంగాణతో పాటు మిగతా అన్ని చోట్ల కూడా ఒకే టైం కి షోస్ పడేలా  పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. కరెక్ట్ గా ఒంటిగంట ఎనిమిది నిమిషాలకి అన్ని చోట్ల షోస్ పడనున్నాయి. ఈస్ట్ గోదావరిని చూసుకుంటే  కాకినాడ పద్మప్రియ, రాజమండ్రి గీత అప్సర, అమలాపురం రమ టాకీస్, మండపేట రాజారత్న థియేటర్స్ లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. అలాగే కృష్ణ జిల్లా చూసుకుంటే ట్రెండ్ సెట్, అలంకార్, శైలజ.గుంటూరు రీజియన్ కి సంబంధించి ఒంగోలు గోపి కృష్ణ, గోరంట్ల కాంప్లెక్స్, సత్యం. నెల్లూరు విషయానికి వస్తే కందుకూరు, దర్శి, కనిగిరి, నెల్లూరు టౌన్,లో ని ఎక్కువ థియేటర్స్ లో షోస్ పడనున్నాయి. ఇక ఉత్తరాంధ్ర, గుంటూరు, సీడెడ్, వెస్ట్ గోదావరి  లో కూడా థియేటర్స్ లిస్ట్ రెడీ చేస్తున్నారు.

ఇక తెలంగాణ లో కూడా భారీ ఎత్తున ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇక్కడ కూడా థియేటర్స్ లిస్ట్ రెడీ అవుతుంది. హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే ,విశ్వనాద్ సుదర్శన్ 35 ,భ్రమరాంబ, మల్లికార్జున, విమల్, శ్రీ రాములు లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇవే కాకుండా మరిన్ని ఏరియాల్లో కూడా  ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఆ లిస్ట్ కూడా రిలీజ్ టైం కి బయటకి వచ్చే అవకాశం ఉంది. ప్రీమియర్ షోస్ కి సంబంధించి  రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్మిషన్ కూడా వచ్చింది.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here