AP Medical Colleges Jobs : ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 488 పోస్టుల భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 9తో ముగియగా…తాజాగా ఆ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో 488 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://dme.ap.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల చాలా జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అభ్యర్థులకు మరో అవకాశంగా దరఖాస్తు గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here