రాజన్న సిరిసిల్ల జిల్లా: నియమ, నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో  పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల, ఆయా శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Permission Should Be Given In Accordance With The Rules Collector Sandeep Kumar-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు  ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అనుమతి కోసం ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి?.ఏ ఏ కారణాలతో నిలిచిపోయాయో ఆయా శాఖల ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.

  ఈ ఏడాది జనవరి నుంచి వివిధ రకాల 45 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని కలెక్టర్ దృష్టికి జీఎం ఇండస్ట్రీస్ గణేష్ రాం తీసుకెళ్లారు.టీ ప్రైడ్ కింద సబ్సిడీ రుణాలు మంజూరుకు ఎస్సీలు 36, ఎస్టీలు 17, దివ్యాంగులు 2 ఎంపిక కాగా, వారికి ఈ నెల 17వ తేదీన ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అర్హత పత్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

పీఎం విశ్వకర్మ స్కీమ్ పై సమీక్షించారు.

ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ ఏడీ భారతి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్డీఎం మల్లికార్జున్, డీటీఓ లక్ష్మణ్, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, సెస్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, డీటీసీపీఓ అన్సార్, లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, డీటీడీఓ జనార్ధన్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here