నిస్సాన్​కు ఇండియాలో ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీ మాగ్నైట్. మొదట 2020లో లాంచ్ అయిన ఈ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ ఉంది. ఈ నేపథ్యంలో ఈ నిస్సాన్​ మాగ్నైట్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సంస్థ రెడీ చేస్తోంది. ఈ విషయం గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. ఇక ఇప్పుడు.. ఈ నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​పై క్లారిటీ వచ్చింది. 2024 అక్టోబర్​ 4న ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సంస్థ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. కొత్తగా వస్తున్న మోడల్​లో కనిపించే మార్పులపై ప్రస్తుతం సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సరికొత్త డిజైన్​, సరికొత్త ఫచ్స్​ ఈ కొత్త నిస్సాన్​ మాగ్నైట్​లో ఉంటాయని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here