కొద్దిరోజులుగా ‘దేవర’ (Devara) సినిమానే హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ‘దేవర’ గురించే మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఊహించని సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ విడుదలకు ముందే నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో 1 మిలియన్ క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు మరో అరుదైన ఘనత.. దేవర ఖాతాలో చేరనుంది. (Devara Beyond Fest)

హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘బియాండ్ ఫెస్ట్’లో ‘దేవర’ సినిమాని ప్రదర్శించబోతున్నారు. లాస్ ఏంజెల్స్ లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్ లో సెప్టెంబర్ 26న, సాయంత్రం 6:30 కి దేవరను ప్రదర్శించనున్నారు. బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించబడుతున్న మొదటి ఇండియన్ ఫిల్మ్ ‘దేవర’నే కావడం విశేషం.

‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. ‘దేవర’తో దానిని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అద్భుతమైన ప్రమోషన్స్ తో ఇతర భాషల ప్రేక్షకులకు దేవర సినిమాని చేరువ చేస్తున్నాడు. నార్త్ ఆడియన్స్ లో సినిమా పట్ల ఆసక్తి కలిగించడం కోసం ట్రైలర్ ఈవెంట్ ని ముంబైలో చేశారు. అలాగే అలియా భట్, సందీప్ రెడ్డి వంగా వంటి వారిని హిందీ ప్రమోషన్స్ లో భాగం చేశారు. ఇక ఇప్పుడు బియాండ్ ఫెస్ట్ తో ఓవర్సీస్ మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్. బియాండ్ ఫెస్ట్ కి ఎందరో హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతారు. వారికి ‘ఆర్ఆర్ఆర్’ నచ్చినట్లుగా ‘దేవర’ కూడా నచ్చితే.. బోలెడంత పబ్లిసిటీ దొరికినట్లే. అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మాదిరిగా ‘దేవర’ కూడా గ్లోబల్ స్థాయిలో సత్తా చాటే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here