యాదాద్రి భువనగిరి జిల్లా:త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 65 వ జాతీయ రహదారిపై శనివారం బాధితులు,రైతులు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని పెంచాలని,భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 Highway Blockade To Change Triple R Alignment , Divis, Srini, Triple R Alignmen-TeluguStop.com

బహిరంగ మార్కెట్ విలువకు,ప్రభుత్వం అందించే నష్టపరిహారానికి చాలా తేడా ఉందని,దీని ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మొదట ఇచ్చిన అలైన్మెంట్లో దివిస్,శ్రీని పరిశ్రమల వద్ద నుంచి రోడ్డు వెళ్లవలసి ఉండగా వాటిని మార్చి చిన్న సన్నకారు రైతుల నుంచి భూసేకరణ చేయడం అన్యాయమన్నారు.

రాస్తారోకోతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here