టీజె జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న సినిమా వేట్టయాన్‌( Vettaiyan ).ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

 Anirudh Makes Interesting Comments About Rajinikanth Vettaiyan, Anirudh, Rana, R-TeluguStop.com

ఇటీవల షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల అనగా అక్టోబర్ 10 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టే పనిలో ఉన్నారు మూవీ మేకర్స్.

ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమాపై సంగీత దర్శకుడు అనిరుద్ ( Anirudh Ravichander )ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ చిత్ర నేపథ్యం గురించి మాట్లాడారు.

ఇప్పటికే రానా( Rana ) ఈ చిత్రంపై చేసిన కామెంట్స్‌ అంచనాలు పెంచగా, తాజాగా అనిరుధ్‌ చేసిన వ్యాఖ్యలు వాటిని రెట్టింపు చేసి రజనీ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాయి.ఈ సందర్భంగా అనిరుద్ మాట్లాడుతూ.వేట్టయాన్‌ సినిమా పవర్‌ఫుల్‌ కథతో రానుంది.దీని స్క్రిప్ట్‌ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.రజనీ ఈ కథకు మరింత బలాన్ని ఇచ్చారు.థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు ఇందులో కొత్త రజనీకాంత్‌ ను చూస్తారు.

ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నిటికంటే ఇది వైవిధ్యంగా ఉంటుంది.సామాజిక అంశాలు, వాస్తవ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.

సూపర్ స్టార్‌ గత చిత్రం జైలర్‌ సినిమా(Jailer )తో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది అని అనిరుధ్‌ తెలిపారు.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ చిత్రం గురించి రానా మాట్లాడుతూ.ఇది రజనీస్టైల్‌ సినిమా కాదని, ఆయన ఇమేజ్‌ కు పూర్తి భిన్నమైన చిత్రాన్ని మొదటిసారి ఎంపిక చేసుకున్నారని తెలిపారు.దీంతో ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here