అతడిని విచారించగా.. అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం ట్రాలీ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి తీసుకురమ్మని చెప్పిన నారాయణతో పాటు సరుకును అందజేసిన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు, కాజీపేట ఏసీపీ తిరుమల్ , తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం సీఐ సురేష్ , హసన్ పర్తి సీఐ చేరాలు, ఎస్ ఐలు దేవేందర్ రెడ్డి, రవి ఇతర సిబ్బందిని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, నందిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.