- rrbapply.gov.in వద్ద ఆర్ఆర్బీ అప్లై అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కేటగిరీ అభ్యర్థులకు రూ.250. మిగతా అన్ని అప్లికేషన్లకు ఫీజు రూ.500. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు హాజరైనప్పుడు దరఖాస్తు ఫీజును పాక్షికంగా రీఫండ్ చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.