రాజా (శివాంక్) ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. తన బాబాయ్ మోసం చేయటంతో ఆస్తి, డబ్బు పోగొట్టుకుంటాడు. తన తండ్రి అమాయకంగా ఉండటంతోనే బాబాయి అలా చేశాడని భావిస్తుంటాడు. బాబాయితో పాటు తండ్రిపైనే ద్వేషంతో ఉంటాడు. స్వార్థంతో జీవిస్తుంటాడు. ఎవరికీ ఏదీ ఇవ్వకుండా ఉంటాడు. మరోవైపు, అక్షయ (వసంతి కృష్ణన్) కాలేజీలో గోల్డ్ మెడల్ సాధిస్తుంది. నిస్వార్థంగా ఉంటుంది. అవసరంలో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తుంటుంది. కుటుంబం అంటే ప్రాణంగా ఉంటుంది. ఇలా.. రాజా, అక్షయ జీవితంలో చాలా భిన్నంగా ఉంటారు. అయితే, వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరుతుంది? వీరి జీవితం ఎలా సాగుతుందనేదే ఈ సీరియల్లో ఉంటుంది.
Home Entertainment New Telugu TV Serial: డిఫరెంట్ లవ్ స్టోరీతో కొత్త టీవీ సీరియల్ ‘నువ్వే కావాలి’.....