ఏపీ టెట్ హాల్ టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • ఏపీ టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ అభ్యర్థి Candidate ID, పుట్టిన తేదీతో పాటు Verfication Code ను ఎంట్రీ చేయాలి.
  • లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ ఉండాల్సిందే. భవిష్యత్ అవసరాల కోసం కూడా భద్రంగా ఉంచుకోవాలి.

భారీగా దరఖాస్తులు…

ఈసారి టెట్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 1- బికు 2,662 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది అప్లికేషన్ చేసుకున్నట్లు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here