ఈమధ్యకాలంలో టాలీవుడ్‌.. పలు వివాదాలతో సతమతమవుతోంది. ఒకదాని వెంట మరోటి అన్నట్టుగా ఒక ఇష్యూ మర్చిపోగానే మరొకటి వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం జానీ మాస్టర్‌ వివాదం మీడియాలో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోందో అందరికీ తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా జానీ మాస్టర్‌, అతని అసిస్టెంట్‌ విషయంలో అల్లు అర్జున్‌, సుకుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్‌ మీడియాలో చర్చ కూడా మొదలైంది. ఇటీవల పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ ఒక ఈవెంట్‌కి హాజరైన సందర్భంగా జానీ మాస్టర్‌ వ్యవహారంలో బన్నీ, సుకుమార్‌ల పాత్ర ఏమిటి? అనే ప్రశ్న వచ్చింది. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి రవిశంకర్‌ ప్రయత్నించారు.

‘ఇది జానీ మాస్టర్‌, ఆ అమ్మాయి వ్యక్తిగత వ్యవహారమే తప్ప దీనిలో ఎవరి ప్రమేయం లేదు. పుష్ప2 స్టార్ట్‌ అయినపుడు ఆ అమ్మాయి అడిషనల్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది. ఆరు నెలల క్రితం విడుదల చేసిన లిరికల్‌ వీడియోలో కూడా ఆమె పేరు ఉంది. ఇప్పుడు పుష్ప2కి సంబంధించి ఒక స్పెషల్‌ సాంగ్‌ చెయ్యాల్సి ఉంది. రెండు రోజుల్లో షూటింగ్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకునే లోపు ఇది జరిగింది. ఇక దీనిలో బన్నీ, సుకుమార్‌ పాత్ర ఏమిటి.. అనే దాని గురించి చెప్పాలంటే.. కొరియోగ్రాఫర్స్‌, డాన్సర్లు కనిపిస్తే వారిని విష్‌ చేయడం తప్ప అంతకుమించి బన్నీకి ఏమీ తెలీదు. ఈమధ్యకాలంలో సెన్సేషన్‌గా మారిన ఈ ఇష్యూతో పుష్ప 2 యూనిట్‌కి ఎలాంటి సంబంధం లేదు. పుష్ప2లో మరో రెండు పాటలు షూట్‌ చెయ్యాల్సి ఉంది. అక్టోబర్‌ 15 తర్వాత వాటిని చెయ్యాలనుకుంటున్నాం’ అంటూ ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత రవిశంకర్‌. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here