నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’, ‘వీరసింహ రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ‘NBK 109’పై భారీ అంచనాలున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘వీరమాస్’​ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, తాజాగా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసినట్లు వినికిడి.

ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ‘NBK 109’ ని 2025, సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. 

కాగా ఇప్పటికే 2025 సంక్రాంతి సీజన్ పై ‘విశ్వంభర’ (Vishwambhara)తో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కర్చీఫ్ వేశారు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ జనవరి 10న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here