టాలీవుడ్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ఎంత క్రేజ్‌ వుందో అందరికీ తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ రేంజ్‌ ఏమిటి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇక ఎన్టీఆర్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎంత హెవీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్‌ సోలో హీరోగా వస్తున్న సినిమా దేవర. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ 27న దేవర రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా క్షణాల్లో వైరల్‌ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఎనౌన్స్‌ చేశారు మేకర్స్‌. 

ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూడబోతున్నామన్న ఆనందంలో అభిమానులు ఉన్నారు. అయితే అనుకోకుండా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని రద్దు చెయ్యాల్సి వచ్చింది. ఊహించిన దానికి భిన్నంగా రెట్టింపు కంటే ఎక్కువగా వేల సంఖ్యలో అభిమానులు రెండు రాష్ట్రాల నుంచి తరలి రావడంతో ఫంక్షన్‌ నిర్వాహకులు, పోలీసులు వారిని కంట్రోల్‌ చెయ్యలేక చేతులెత్తేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఫంక్షన్‌ను క్యాన్సిల్‌ చేశారు. ఈ విషయంలో అభిమానులు ఆగ్రహానికి గురైన నేపథ్యంలో ఎన్టీఆర్‌ వారిని శాంతింప జేసేందుకు ఒక వీడియోను విడుదల చేశారు. దాంతో వారంతా కూల్‌ అయ్యారు. 

ఇదిలా ఉంటే.. దేవర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ క్యాన్సిల్‌ అవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఒక కారణం అని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే దేవర ఫంక్షన్‌ ఫిక్స్‌ అయింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు కూడా ఫంక్షన్‌ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆదివారం అనుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే ఒక కార్యక్రమం మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో కన్‌ఫర్మ్‌ అయింది. దీంతో అసలు సమస్య మొదలైంది. దేవర ఫంక్షన్‌ కోసం వచ్చిన పోలీసుల్లో చాలా మంది ట్రైడెంట్‌ హోటల్‌కి వెళ్లాల్సి వచ్చింది. పదివేల మంది అభిమానుల కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తే 30 వేల మంది ఫంక్షన్‌కి రావడంతో కంట్రోల్‌ చెయ్యడం వారి వల్ల కాలేదు. 10వేల మందిని కంట్రోల్‌ చెయ్యడానికి నియమించిన పోలీసుల్లోనే చాలా మంది సీఎం ప్రోగ్రామ్‌కి వెళ్ళిపోయారు. 

సీఎం ప్రోగ్రామ్‌ ముగించుకొని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు తిరిగి వచ్చారు. అప్పటికే నోవాటెల్‌ హోటల్‌ దగ్గర జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో హోటల్‌కి కూడా పాక్షికంగా నష్టం జరిగింది. దీంతో ఫంక్షన్‌ నిర్వహించడం కష్టమని హోటల్‌ సిబ్బంది కూడా చెప్పారు. ఆ సమయంలోనే పోలీసులతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులకు, నిర్వాహకులకు ఫంక్షన్‌ క్యాన్సిల్‌ చెయ్యడం తప్ప మరో మార్గం కనిపించలేదు. దేవర ఫంక్షన్‌ను క్యాన్సిల్‌ చెయ్యడానికి ఒక విధంగా సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమమే కారణమని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ ముందుగానే ఫిక్స్‌ అయి ఉంటే దేవర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి అనుమతులు కూడా ఇచ్చేవారు కాదు. రెండు ప్రోగ్రామ్స్‌ ఒకే టైమ్‌లో, దాదాపు రెండిరటికీ ఒకే ఏరియాలో వెన్యూలు ఫిక్స్‌ కావడంతో ఈ సమస్య వచ్చింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here