యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా దేవరగా అడుగుపెట్టబోతున్నాడు. పైగా సోలో హీరోగా ఐదు సంవత్సరాల తర్వాత వస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో దేవర(devara)మీద ఒక రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో ఓవర్ సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనేక రికార్డులని నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో దేవర ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది. టికెట్స్ బుకింగ్ అయిన దాన్ని బట్టి చూస్తే  తొలి రోజు ఎన్టీఆర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డుని క్రియేట్ చేసేటట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్, బాహుబలి సిరీస్, కల్కి, సాహో లాంటి సినిమాలు తొలి రోజు వంద కోట్ల పైన కలెక్షన్స్ ని సాధించాయి. ఇప్పుడు వాటన్నింటిని దేవర క్రాస్ చేస్తుందని ఎన్టీఆర్ అభిమానులు ఘంటా పదంగా చెప్తున్నారు

 

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ(koratala siva)కాంబోలో దేవర తెరకెక్కగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(jahnvi kapoor)హీరోయిన్ గా చేస్తుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ని పోషించగా ఎన్టీఆర్ ఆర్ట్స్(ntr arts)అండ్ యువ సుధా ఆర్ట్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే అన్ని ఏరియాల్లో షోస్ పడుతున్నాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిని కూడా ఇచ్చాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here