ఆ వీడియోలో ఏముంది.?

మహిళలు ఫ్లిప్ కార్ట్ నుంచి హ్యాండ్ బ్యాగులను ఆర్డర్ చేసి, వాటిని, భర్తలకు తెలియకుండా ఇంట్లో వివిధ ప్రదేశాల్లో దాచే సన్నివేశాన్ని ఈ వీడియోలో చిత్రీకరించారు. దీంట్లో పురుషులను తెలివితక్కువ వారిగా, అమాయకులుగా చిత్రించారు. వారిని ‘‘అల్సీ, కంబక్త్ , బేవాకోఫ్ పతి” అని అభివర్ణిచారు. దీనిపై ఒక పురుషుల హక్కుల సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వీడియోలో భర్తలను “అల్సీ, కంబక్త్ మరియు బేవాకోఫ్ పతి” అని అన్యాయంగా అభివర్ణించిందని నేషనల్ కౌన్సిల్ ఫర్ మెన్ అనే సంస్థ వాదించింది. ఈ విమర్శల నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ వెంటనే ఆ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here