జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara) భారీ అంచనాలతో నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమాకి పరవాలేదు అనే టాక్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ మెచ్చేలా సినిమా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బిగ్ మిస్టేక్ ఉంది. దానిని సినిమా చేసిన వారితో పాటు, చూసిన వారు కూడా పెద్దగా  పసిగట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ సినిమాలో ద్విపాత్రాభినయం పోషించాడు ఎన్టీఆర్. తండ్రీకొడుకులు దేవర, వర పాత్రల్లో ఆయన కనిపించాడు. ఇక రాయప్ప పాత్రలో శ్రీకాంత్ నటించగా, అతని కూతురు తంగం పాత్రలో జాన్వీ కపూర్ సందడి చేసింది. అయితే ఈ  నాలుగు పాత్రల మధ్య చూపించిన రిలేషన్ గందరగోళంగా ఉంది. దేవర, రాయప్ప బ్రదర్స్ లా ఉంటారు. ముఖ్యంగా రాయప్ప చెల్లిని దేవర సొంత చెల్లిలా భావిస్తాడు. అంటే తంగంకి దేవర బాబాయ్ లాంటి అవుతాడు. కానీ ఏదో మావయ్య మీద మనసు పడినట్లుగా.. నాకు దేవర లాంటి భర్త కావాలని తంగం పదే పదే అనడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది చాలదు అన్నట్టుగా.. దేవర, రాయప్ప మధ్య సోదరభావం ఉంటే.. వారి పిల్లలైన వర, తంగం వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. కానీ ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. 

ఇలా ఈ నలుగురి రిలేషన్స్ విషయంలో కొరటాల తెలిసో తెలియకుండానో తప్పుగా రాసేసాడు. అలా కాకుండా రాయప్ప సోదరి కూతురిగా తంగంని చూపించినా బాగుండేది. అప్పుడు దేవర వరుసకి మామ అయ్యేవాడు. దాంతో మామ లాంటి మొగుడు కావాలని ఆమె అన్నా.. కాస్త వినడానికి బాగుంటుంది. అప్పుడు వర కూడా వరుసకు బావ అవుతాడు కాబట్టి.. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా సెట్ అయ్యేది. మొత్తానికైతే ఇంత పెద్ద సినిమాలో కీలక పాత్రల మధ్య రిలేషన్ విషయంలో కొరటాల పప్పులో కాలేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here