సౌత్ చైనా సీ వల్ల..

సౌత్ చైనా సీ పై ఆధిక్యత కోసం అమెరికా, చైనాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాలుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ప్రాదేశిక వివాదాలు, సైనిక ఉనికి కారణంగా దక్షిణ చైనా సముద్రం అస్థిరంగా మారే అవకాశం ఉందన్నారు. అంతేకాక, ‘‘అతిపెద్ద సైబర్ దాడి అమెరికా జాతీయ భద్రతను దెబ్బతీస్తుంది. దాంతో, అది అనుకోకుండా యుద్ధాన్ని ప్రేరేపిస్తుంది’’ అని వివరించారు. ఇటువంటి ఆందోళనలను “నిజమైనవి” అని సలోమే పేర్కొన్నారు. పెరుగుతున్న చైనా మార్కెట్, అలాగే, రష్యాతో బలోపేతమవుతున్న చైనా సంబంధాలను ఉదహరిస్తూ.. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా భిన్న ధృవాల మధ్య తీవ్రమైన ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటుందన్నారు. ప్రాంతీయ కలహాలు ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి నెలకొంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here