వాట్సాప్ వీడియో కాల్ ఫిల్టర్లు, బ్యాక్ గ్రౌండ్స్

వీడియో కాల్స్ కోసం ఫిల్టర్లు, బ్యాక్​గ్రౌండ్​లను అందుబాటులోకి తెస్తున్నట్లు వాట్సాప్ ఈ వారం ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్​తో మీరు ఇప్పుడు మీ బ్యాక్​గ్రౌండ్​ని మార్చుకోచ్చు లేదా మరింత పర్సనల్​ టచ్​ కోసం వీడియో కాల్ సమయంలో ఫిల్టర్​ని జోడించవచ్చు. 10 ఫిల్టర్లు, 10 బ్యాక్​గ్రౌండ్​లు ఉంటాయి. మీరు ప్రత్యేకమైన రూపాన్ని సృష్టించడానికి విస్తృత శ్రేణి ఆప్షన్స్​ని ఎంచుకోవచ్చు. వార్మ్, కూల్, బ్లాక్ అండ్ వైట్, లైట్ లీక్, డ్రీమీ, ప్రిజం లైట్, ఫిష్​ఐ, వింటేజ్ టీవీ, ఫ్రాస్టెడ్ గ్లాస్, డుయో టోన్ వంటి ఫిల్టర్ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ ఆప్షన్లలో బ్లర్, లివింగ్ రూమ్, ఆఫీస్, కేఫ్, పెబుల్స్, ఫూడీ, స్మూష్, బీచ్, సన్ సెట్, సెలబ్రేషన్ అండ్ ఫారెస్ట్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here