నేషనల్ కాన్ఫిరెన్స్-కాంగ్రెస్ పార్టీ

సర్వే అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే జమ్మూ కశ్మీర్ లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫిరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్లోని మొత్తం 90 సీట్లకు గానూ, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, జేకేపీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమిలో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫెరెన్స్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలవవచ్చు. జేకేఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, జేకేపీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం ఓట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. కలిసి పోటీ చేసిన జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here