నటీనటులు: సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరి. మరియు నవీన్ తదితరులు  

ఛాయాగ్రహణం : రామకృష్ణ (ఆర్.కె) 

సంగీతం : బాలాజీ

నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్

నిర్మాత : అశోక్ షిండే

రచన, దర్శకత్వం : ఓషో తులసీరామ్

సాయి ధన్సిక కథనాయికగా రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘దక్షిణ’. డైరెక్టర్ ఓషో తులసిరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

ఏసీపీ దక్షిణ(సాయి ధన్సిక) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆమె వర్క్ చేస్తున్న సిటీలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకర్ని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిలను అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు ఓ సైకో. ఈ క్రమంలో దక్షిణ జీవితంలో కూడా ఓ దారుణం జరుగుతుంది. అసలు ఆ సైకో ఎవరు? ఎందుకు అతను అతి దారుణంగా అమ్మాయిలను చంపుతున్నాడు? దక్షిణ జీవితంలో జరిగిన దారుణం ఏంటి? ఆ దారుణం చేసిన సైకోపై దక్షిణ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? ఈ క్రమంలో దక్షిణ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

మొదటి సన్నివేశంతోనే సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాడు దర్శకుడు ఓషో తులసీరామ్.  అమ్మాయిల హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం బాగుంది. ముఖ్యంగా సాయి ధన్సిక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మెప్పించింది. ఏసీపీపై ఒక సైకో కిల్లర్ తేలిగ్గా అఘాయిత్యం ఎలా చేయగలడు? సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టే తిరిగింది. ప్రేక్షకులు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆత్రుతతో సినిమాను చూస్తారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ గ్రిప్పింగ్ గా ఉంది. ఊహించని మలుపులు సినిమాలో ఉన్నాయి. ఇక సెకండాఫ్ ని ఎమోషనల్ గా నడిపించిన విధానం బాగుంది. అయితే సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉన్నప్పటికీ.. కొన్ని కీలక సన్నివేశాలు మరింత బలంగా రాసుకొని ఉండాల్సింది అనిపించింది. కొన్ని అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఉన్నాయి.

ప్రధాన పాత్రలో నటించిన సాయి ధన్సిక తన బాడీ లాంగ్వేజ్ తో, నటనతో మెప్పించింది. ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్ స్ లో బాగా నటించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన రిషవ్ బసు కూడా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన బాగుంది. సుభాష్, ఆనంద భారతి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా..

అమ్మాయిల వరుస హత్యల నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన దక్షిణ మూవీ మెప్పించింది.

రేటింగ్: 2.5/5  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here