“విభిన్న భాషలు, సంప్రదాయాలకు నెలవు తెలంగాణ. భారత దేశ బహుళత్వం, కలుపుకోలు తనానికి తెలంగాణ వెన్నెముకగా నిలుస్తూ వస్తోంది. నార్త్ కరోలినా, చార్లెట్టే సిటీ కలిసిగట్టుగా ఉండేందుకు తెలుగు భాష మాట్లాడే సమాజం కృషి చేస్తోంది. తెలంగాణ నుంచి వచ్చిన చార్లెట్టేలోని తెలుగు సమాజం ఇక్కడి సంప్రదాయ వైవిధ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతోంది. అంతేకాకుండా నార్త్ కొరిలినాలోని వైద్య, ఇంజినీరింగ్, రాజకీయ, లీగల్, సంక్షేమ రంగాల్లోనూ చురుకుగా పాల్గొంటోంది. అందుకే తెలంగాణ ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపును ప్రకటిస్తున్నాము. అక్టోబర్ 3 నుంచి 11 వరకు తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటిస్తున్నాను,” అని చార్లెట్టే మేయర్ వీ అలెగ్జ్యాంజర్ లైలెస్ చేసిన ప్రకటనలో ఉంది.
Home International Bathukamma festival : అమెరికాలో బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపు.. ఘనంగా సంబరాలు!-many american states...