‘విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, సమాశ్రితాం! దారిద్ర ద్వంసినీం, దేవీం సర్వోపద్రవ వారిణీం’

అయిన శ్రీ మహాలక్ష్మీ తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు. సర్వమంగళాలను, అష్టశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ‘యాదేవి సర్వ భూతేషు లక్ష్మి రూపేణ ణ సంస్థితా’ అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీ దేవిని శ్రీ సూక్తసహితంగా సకల ఉపచారాలు జరిపించి, అర్చించుకుని, పూర్ణాలు, క్షీరాన్నం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదించుకుందామని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అమ్మ‌వారికి పూజ‌లు చేస్తే భక్తులకు దేనికీ కొదవ ఉండదు. అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం అని ఆధ్యాత్మిక వేత్త చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఈరోజున గులాబీ వ‌ర్ణం ధ‌రిస్తే మంచిద‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here