రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా మారిన తమిళ కధానాయకుడు జీవా(jiiva)ఆ తర్వాత కూడా చాలా చిత్రాలు తెలుగులో వచ్చి మంచి ప్రేక్షకాదరణని పొందాయి.తాజాగా ఈ నెల 11 న సైన్స్ ఫిక్షన్ అండ్  హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన బ్లాక్(black)అనే మూవీతో రాబోతున్నాడు.కే జి బాలసుబ్రమణి దర్శకుడు కాగాప్రియాభవాని శంకర్(priya bhavani shankar) హీరోయిన్ గా చేస్తుంది.హాలీవుడ్ మూవీ కొహేరెన్సు(coherence)ని ఆధారంగా చేసుకొని బ్లాక్ ని తెరకెక్కించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవా మాట్లాడుతు గతంలో తన సినిమాల విషయంలో జరిగిన కొన్ని  విషయాల గురించి చెప్పుకొచ్చాడు. 2012 లో వచ్చిన ముగమూడీ  మూవీ కంప్లీట్ అయ్యాక కొన్ని మార్పులు చెప్పాను. సెకండ్ ఆఫ్ లాగ్ అయిందని కొంచం తగ్గిస్తే బాగుంటుందని చెప్పినా కూడా డైరెక్టర్ వినలేదు. గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకతంలో వచ్చిన నీదానే పోన్వా సంతం విషయంలో కూడా ఏడు నిముషాలు ఉన్న సీన్ ని తగ్గించమని గౌతమ్ కి చెప్పాను. అయినా కూడా గౌతమ్ వినలేదని చెప్పుకొచ్చాడు.

నీదానే పోన్వా సంతం తెలుగు లో నాని హీరోగా ఏటో వెళ్ళిపోయింది మనసు పేరుతో రిలీజ్ అవ్వగా మూగమూడి తెలుగులో  మాస్క్ అనే పేరుతో విడుదల అయ్యింది. ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్ నిర్మించిన ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే, సెల్వ, నాజర్, గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రల్లో చేసారు.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here