మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)చేతుల మీదుగా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన శుభం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.ఆ నమ్మకంతోనే ఇండస్ట్రీ వ్యక్తులే కాకుండా బయట వాళ్ళు కూడా  చిరు చేతుల మీదుగా తాము అనుకున్న కార్యాన్ని ప్రారంభిస్తుంటారు. మీడియాలో ఉన్న వాళ్ళు కూడా చిరంజీవి చేతుల మీదుగా తమ చానల్ ని ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా  మెగా 9(mega 9 tv)అనే నూతన ఛానల్ ని  చిరంజీవి ప్రారంభించడం జరిగింది. అనంతరం చిరంజీవి మాట్లాడుతు మెగా 9 టీవీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మెగా యాజమాన్యానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.రాబోయే రోజుల్లో ఛానల్  దుమ్ము దులిపెయ్యాలని చెప్పాడు. ఛానల్ లోగోని ఆవిష్కరించి దాని మీద తన ఆటో గ్రాఫ్ కూడా చేసాడు.  అడగగానే  తమ మెగా 9 టీవీ ని ప్రారంభించినందుకు చిరంజీవి కి ఛానల్ నిర్వాహకులు ధన్య వాదాలు కూడా చెప్పారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here