నితీశ్ ధనాధన్

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 34 బంతుల్లో 74 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‍లోనే తొలి అంతర్జాతీయ అర్ధ శకతం పూర్తి చేశాడు. ముందుగా నిదానంగా ఆడిన నితీశ్.. ఆ తర్వాత భారీ హిట్టింగ్ చేశాడు. 4 ఫోర్లు కొట్టిన నితీశ్ 7 సిక్స్‌లు బాదేశాడు. రింకూ సింగ్ కూడా అర్ధ శకతంతో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఓ దశలో 3 వికెట్లకు 41 పరుగులే చేసి కష్టాల్లో పడిన టీమిండియాను నితీశ్, రింకూ ఆదుకున్నారు. 108 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సంజూ శాంసన్ (10 పరుగులు), అభిషేక్ శర్మ (15), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) వెనువెంటనే ఔటయ్యాక వారిద్దరూ దుమ్మురేపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here