దక్షిణ భారతదేశంలో వారం పొడవునా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏపీ, తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో తేలికపాటి వానలు పడనున్నాయి. కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్టల్ కర్నాటక ప్రాంతాల్లో స్థిరమైన వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 10న తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 12 నుంచి 14 వరకు కూడా అతిగా వానలు పడే అవకాశం ఉంది. కేరళ, మహేలో కూడా అక్టోబర్ 12, 13 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అక్టోబరు 10న లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తా కర్ణాటకలో అక్టోబర్ 10, 13 తేదీల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ పేర్కొంది.
Home International Weather Update : దక్షిణ భారతదేశంలో వానలు.. కేరళ కర్ణాటకలో భారీ వర్షాలు పడే అవకాశం-imd...