డాసియా బిగ్ స్టర్‌ని మూడు ఇంజిన్ ఆప్షన్లతో సంస్థ అందిస్తోంది. ఇందులో మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, ఎల్పీజీ ఉన్నాయి. మైల్డ్-హైబ్రిడ్ బిగ్‌స్టర్ ఎస్‌యూవీలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 140 హార్స్‌పవర్‌ని అందిస్తుంది, 48 వీ సిస్టమ్‌ని కలిగి ఉంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. అదనంగా, ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇందులో స్నో, మడ్ / శాండ్, ఆఫ్-రోడ్, నార్మల్, ఎకో, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి వివిధ డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. మరో ఇంజిన్ ఆప్షన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్. ఇది మైల్డ్-హైబ్రిడ్ సహాయంతో ఎల్పీజీ, పెట్రోల్ రెండింటితో పనిచేస్తుంది. ఇది 140 హార్స్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. డాసియా ప్రకారం, బిగ్‌స్టర్ ఎల్పీజీలో 50-లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 49-లీటర్ ఎల్పీజీ ట్యాంక్ ఉండటంతో రీఫ్యూయెలింగ్కి ముందు ఏకంగా 1,450 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది.