2025 సంక్రాంతికి ‘NBK 109’తో నందమూరి బాలకృష్ణ, ‘గేమ్ ఛేంజర్’తో రామ్ చరణ్ బరిలోకి దిగుతున్నారు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే సంక్రాంతి సమరానికి సై అంటూ సడెన్ గా సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు.

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ చెప్పారు. బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించడం కంటెంట్ మీద నమ్మకమా? లేక ప్రమోషనల్ స్టంట్ ఆ? అనేది తెలియాల్సి ఉంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here