తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర విచారణలో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్వతంత్ర దర్యాప్తు బృందంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసులు, ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఉంటారన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్లను సూచించామన్నారు. టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై కేసులతో పాటు మరో రెండు కేసుల్ని సీఐడీకి బదిలీ చేశామని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసు ఉందన్నారు. ఒక కేసు విషయంలో గుంటూరు జిల్లా ఎస్పీ లుకౌట్ నోటీస్ జారీ చేశారని పేర్కొ్న్నారు. ఆ కేసుకు సంబంధించి చట్టపరమైన తీసుకునే వీలుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here