కరీంనగర్ కాంగ్రెస్ లో ఇందిరమ్మ కమిటీలు కాక పుట్టిస్తున్నాయి. నేతల మధ్య సమన్వయ లోపంతో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. తమకు ప్రాధాన్యత ఉండటం లేదని సీనియర్ కార్యకర్తలు మదనపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు చేరిన చోట భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.