రాష్ట్రాల వారీగా వసూళ్లు
అలాగే, ఏపీ, తెలంగాణ కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 రోజుల్లో అంటే మూడు వారాల్లో దేవర సినిమా రూ. 156.63 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 226.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో 17.85 కోట్లు, తమిళనాడులో 4.15 కోట్లు, కేరళలో 97 లక్షలు, హిందీ రెస్టాఫ్ ఇండియాలో 33.90 కోట్లు, ఓవర్సీస్లో 35.95 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది దేవర చిత్రం.