ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి..
ఈ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అయితే, యూజర్లు ముందుగా తమ స్మార్ట్ ఫోన్స్ లోని ఇన్ స్టాగ్రామ్, స్పాటిఫై యాప్స్ ను వాటి తాజా వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాలి. ఇన్ స్టాగ్రామ్ (instagram) వినియోగదారులు ఇప్పుడు స్పాటిఫై ట్రాక్స్, ఆల్బమ్స్ లేదా ప్లేజాబితాలకు లింక్ లు కలిగి ఉన్న స్టోరీలను సృష్టించవచ్చు. ఒక స్టోరీలో పాటలను చూసిన తర్వాత స్పాటిఫైలో ఆ పాటను సెర్చ్ చేయడానికి బదులుగా, వినియోగదారులు సింపుల్ గా ఆ స్టోరీలో ఇంటిగ్రేట్ అయి ఉన్న “ప్లే లిస్ట్ కు జోడించు” బటన్ పై క్లిక్ చేసి, ఆ పాటను తమ స్పాటిఫై (spotify) ప్లే లిస్ట్ లో యాడ్ చేయవచ్చు.