ఇటీవలి కాలంలో జానీమాస్టర్‌పై పెట్టిన లైంగిక వేధింపుల కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరీకీ తెలిసింది. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ అయిన యువతి తనను జానీ మాస్టర్‌ లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని జానీ మాస్టర్‌ని కొన్నాళ్ళ క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం జానీ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసు విషయమై ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు మాట్లాడారు. తాజాగా అనీ మాస్టర్‌ దీనిపై స్పందిస్తూ..

‘జానీ మాస్టర్‌పై కేసు పెట్టారని తెలిసి నేను చాలా షాక్‌ అయ్యాను. అంతేకాదు, ఆయనకు ప్రకటించిన నేషనల్‌ అవార్డును క్యాన్సిల్‌ చేయడం నాకెంతో బాధ కలిగించింది. ఒక టెక్నీషియన్‌ టాలెంట్‌ని గుర్తించి ప్రకటించిన అవార్డు అది. జానీ ప్రస్తుతం నిందితుడు మాత్రమే. ఇంకా నేర నిరూపణ కాలేదు. అలాంటప్పుడు ప్రకటించిన అవార్డును ఎలా క్యాన్సిల్‌ చేస్తారు? నేను జానీ దగ్గర రెండు సంవత్సరాలు పనిచేశాను. ఆయన చాలా మంచి వారు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు రావడం నిజంగా బాధ కలిగించింది. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. కానీ, జానీ విషయంలో అతను నిరపరాధి అని తేలితే.. అప్పుడేంటి? కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకోవాలంటే ఇక్కడ ఎంతో కష్టపడాలి. అందరూ అలా కష్టపడి పైకి వచ్చినవారే. నా విషయానికి వస్తే.. నా కెరీర్‌ మొత్తంలో ఎప్పుడూ నాకు కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఎదురు కాలేదు. 

జానీపై ఆరోపణ చేసిన అమ్మాయి గురించి చెప్పాలంటే.. కొన్ని రోజుల క్రితం వరకు జానీ తనకు దేవుడితో సమానం అని చెప్పింది. అతనితో వర్క్‌ చేస్తున్న సమయంలో నేను గమనించాను. చాలా హ్యాపీగా ఉండేది. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా జానీపై ఫిర్యాదు చేయడాన్ని మనం ఎలా చూడాలి. నాకు జానీ గురువు. ఆయన జైలులో ఉండడం మాత్రం కరెక్ట్‌ కాదు అనిపిస్తోంది. దీని గురించి ఎవరూ మాట్లాడడం లేదు అని అందరూ అంటున్నారు. దానికి కారణం, ఇది ఒక అమ్మాయికి సంబంధించింది. సెన్సెటివ్‌ పాయింట్‌. కాబట్టే ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. జానీపై కుట్ర పన్ని అతని ఇలా ఇరికించారని కూడా చాలా మంది అంటున్నారు. కానీ, ఆ విషయం గురించి నేను ఏమీ మాట్లాడలేను. 

యూనియన్‌ అన్న తర్వాత చాలా సమస్యలు ఉంటాయి. ఏ యూనియన్‌లో అయినా ఉంటాయి. డాన్సర్స్‌కి ఏదైనా హెల్త్‌ సమస్య వస్తే ఫస్ట్‌ హెల్ప్‌ చేసేది జానీ, శేఖర్‌, భాను మాస్టర్స్‌. ఇక డాన్స్‌ మాస్టర్స్‌ యూనియన్‌ గురించి చెప్పాలంటే.. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ అమ్మాయికి యూనియన్‌ కార్డ్‌ ఇప్పించడానికి జానీ వైఫ్‌ చాలా గట్టిగా ప్రయత్నించారు, అడిగారు. ఒక డాన్సర్‌కి కార్డ్‌ ఇవ్వాలంటే కొన్ని రూల్స్‌, రెగ్యులేషన్స్‌ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ ఇవ్వాలి. జానీ యూనియన్‌కి అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఆమెకు కార్డ్‌ రాకుండా తొక్కి పెట్టారని చెప్పడం చాలా తప్పు. ఆ అమ్మాయి ఛాన్సుల కోసం నా దగ్గరికి కూడా వచ్చింది. అయితే నెలకి ఒకటో రెండో సాంగ్స్‌ చేస్తాను. నా కంటే జానీ, శేఖర్‌, గణేశ్‌ మాస్టర్స్‌ ఎక్కువ పాటలు చేస్తుంటారు, వారి దగ్గర ట్రై చెయ్యమని చెప్పాను. తనకు హీరోయిన్‌ అవ్వాలని ఉంది అని చెప్పింది. ముందు డాన్సర్‌ అయి మంచి పేరు తెచ్చుకోమని చెప్పాను. 

ఎవరు ఎన్ని చెప్పినా, ఆ అమ్మాయి ఎన్ని రకాలుగా జానీపై ఫిర్యాదు చేసినా విచారణ కొనసాగుతుంది,  నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి. నేను ఇద్దరిలో ఎవరినీ సపోర్ట్‌ చేయడం లేదు. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చి తీర్పు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను’ అన్నారు అనీ మాస్టర్‌.  


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here