• నేను చాలా కాలంగా జుట్టుకు రంగు వేయాలనుకుంటున్నాను, కానీ ఏ రంగును వేసుకోవాలో నిర్ణయించలేను. హెయిర్ కలర్ రంగు, నాణ్యతను ఎంచుకునేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటి? నేను నా జుట్టుకు గులాబీ లేదా నీలం వంటి రంగును ఎంచుకోవచ్చా?
హెయిర్ కలర్ ఎంచుకోవడం మీ వ్యక్తిగత నిర్ణయం. మీ కళ్ళ రంగు ఎలా ఉంది అనే దాన్ని బట్టి జుట్టు రంగును ఎంచుకోవడం మంచిది. మీ వృత్తిని బట్టి కూడా మీరు ఎంచుకునే రంగులు ఆధారపడి ఉంటాయి. మీ చర్మం రంగును బట్టి కూడా హెయిర్ కలర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు డాక్టర్ అయితే, నీలం లేదా గులాబీ వంటి రంగు మీ వృత్తికి సరిపోదు. మీ కోసం జుట్టు రంగును ఎంచుకోవాలని నిర్ణయించుకోవడానికి, మొదటిసారి ఒక ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడం మంచిది. హెయిర్ సెలూన్ కు వెళ్లి మీకు ఏ రంగు సూట్ అవుతుందో నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత హెయిర్ కలర్ వేయించుకోవాలి. మీరు మీ జుట్టుకు నీలం లేదా గులాబీ రంగును కూడా ఎంచుకోవచ్చు. దానితో ఎటువంటి సమస్య లేదు. కానీ, నీలం, ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు అనేవి అంత ప్రొషెషనల్ గా కనిపించే రంగులు కావు. వీటన్నింటినీ ఐదు నుంచి పదిసార్లు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత తొలగించేయాలి. తొలిసారి జుట్టుకు నీలం లేదా గులాబీ రంగును వేసుకోవడానికి ముందు నేరుగా నిపుణులను కలిపి సలహా తీసుకోవడం మంచిది.