కానీ తమ పుత్రుని ప్రవర్తన సరిలేని కారణంగా… సమాజం, గ్రామం, పట్టణం, దేశం, నాశనం కావచ్చు కాబట్టి, చంపవలసిందని ప్రార్ధించే తల్లిని ఎక్కడైనా చూస్తామా?! అలా కోరిన తల్లి భూదేవి మాత్రమే. అలా అంగీకరించిన తండ్రి శ్రీహరి మాత్రమే. ఈ విశేషాన్ని తెలియచేస్తూ నరక చతుర్దశి రోజున నరకుని బొమ్మని దహింప చేస్తారు. వాతావరణంలో చలి బాగా ప్రవేశించే రోజులైనందున వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఆ కారణంగా నరక చతుర్దశి నాటి స్నానవేళలో ఆముదపు తీగని, ఆనప తీగని (సొర) తలచుట్టూ తిప్పి విసిరివేస్తే దృష్టి దోషాలు పోతాయని చెబుతారు. ఆనాడు మనం చేసే భోజనంలో ఆ రెండింటినీ వాడకూడదని చిల‌క‌మ‌ర్తి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here