- ఒక కేజీ స్కిన్ లెస్ చికెన్ తీసుకోవాలి. విత్ బోన్ తీసుకుంటే ఫ్రై రుచి బాగుంటుంది
- చికెన్‌ను శుభ్రంగా కనీసం 3-4 సార్లు కడగాలి
- అనంతరం హోల్స్ ఉన్న గిన్నెలో ఆ ముక్కలు వేసి వాటర్ పోయి డ్రై అయ్యే వరకు ఉండాలి
- ఆ తర్వాత ఆ ముక్కల్లో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
- పదార్థాలతో బాగా కలిపిన ముక్కల్ని కనీసం 25-30 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే.. కలర్‌ఫుల్‌గానే కాదు ఫ్రై టేస్టీగా కూడా వస్తుంది.
టేస్టీ పొడిని ప్రిపేర్
- స్టవ్ వెలిగించుకుని దానిపై పాన్ పెట్టి… అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ మిరియాలు, నాలుగు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అర టీస్పూన్ సోంపు, అర టీస్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫేంలో కనీసం 2 నిమిషాలు వేయించాలి.
- ఒకవేళ పొరపాటున మంట ఎక్కువ పెడితే ఇవి మాడిపోతాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి.
- ఆఖరిగా ఎండు మిర్చిని తుంచి అందులో వేసి ఒక నిమిషం వేయించాలి. పొరపాటున మీరు మొదట్లోనే ఎండు మిర్చి వేస్తే మాడిపోతాయి.
- ఈ పదార్థాలన్నీ తీసుకుని కొద్దిగా రాళ్ల ఉప్పుతో కలిపి మిక్సీలో వేసి పౌడర్లా కాకుండా కాస్త గరుకుగా ఉండేలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి.
చికెన్ ఫ్రై తయారీ
- స్టవ్ వెలిగించి పాన్ పెట్టి.. అందులో ఐదు టేబుల్ స్పూన్ నూనె వేయాలి
- నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చి మిర్చీ ముక్కల్ని వేసి కనీసం 2 నిమిషాలు తక్కువ మంటతో వేయించాలి.
- ఆ తర్వాత తాజాగా ఉన్న కరివేపాకును వేయాలి
- చికెన్ ముక్కలను వేసి కనీసం 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి తక్కువ తక్కువ మంటతో ఓ 10 నిమిషాలు వేయించాలి.
- మీకు అడుగంటుతున్నట్లు అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసినా ఓకే
- చికెన్ బాగా వేగిన తర్వాత అందులో మూడు పచ్చి మిర్చీ ముక్కలు, కాస్త కరివేపాకు వేయాలి.
- ఆ తర్వాత మనం ఆల్రెడీలో మిక్సీలో పొడి చేసిన పదార్థాల పొడిని ఈ చికెన్ ముక్కలపై వేసి వేయించాలి.
- మంటని తక్కువగా పెట్టుకుని కనీసం 1-2 నిమిషాలు వేయిస్తే చాలు.
- ఆఖర్లో కొత్త మీర వేసి ఒక నిమిషం అలా వేయించి స్టవ్ ఆపేస్తే ఆంధ్రా స్టయిల్ చికెన్ ఫ్రై రెడీ.
ఈ చికెన్ ఫ్రైలో నిమ్మరసం పిండి, ఉల్లిపాయతో కలిపి తింటే.. జీవితంలో రుచిని మర్చిపోలేరు. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా, లేదా స్పెషల్ రోజుల్లో కూడా ఈ ఫ్రైను మీరు ట్రై చేసి వారిని సర్ప్రైజ్ చేయవచ్చు.