రవ్వ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
- సన్నని సూజి లేదా ఉప్మా రవ్వ -1 కప్పు
- చక్కెర- 1 కప్పు
- కొబ్బరి -1/2 కప్పు (తురిమిన)
- గోరు వెచ్చని పాలు- 1 కప్పు
- జీడిపప్పు- 1 స్పూన్
- బాదం-1 స్పూన్
- ఎండు ద్రాక్ష -1 స్పూన్
- యాలకుల పొడి- 1/4 స్పూన్
- నెయ్యి -6 స్పూన్లు
తయారీ విధానం
- స్టవ్ ఆన్ చేసి.. కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేయాలి
- నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేయాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి మీకు అందుబాటులో లేకపోతే తురిమిన ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు.
- సన్నని మంటపై కాసేపు కొబ్బరిని వేయించి.. గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత కడాయిని దించేసి ఒక గిన్నెలోకి ఆ కొబ్బరిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి
- ఆ తర్వాత మళ్లీ కడాయి గ్యాస్‌పై పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలి
- నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం, జీడిపప్పు వేసి వేయించాలి
- అవి కలర్ కొద్దిగా మారిన తర్వాత అందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించాలి
- బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఒక గిన్నెలోకి ఆ పదార్థాలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి
- ఆ తర్వాత మళ్లీ కడాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి
- సన్నని మంటపై నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నని సూజి లేదా ఉప్మా రవ్వ వేసి కలపాలి
- రవ్వ గోధుమ రంగులోకి వచ్చే వరకూ కలుపుతూ వేయించాలి
- ఇలా వేయిస్తున్నప్పుడే రవ్వ నుంచి సువాసన కూడా వస్తుంది. అప్పుడు ఆ రవ్వని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
- అనంతరం బౌల్‌లోని రవ్వని తీసుకుని.. అందులో వేయించిన పచ్చి కొబ్బరిని వేసి కలపాలి
- బాగా కలిపిన తర్వాత ఓ 10 నిమిషాలు అలానే ఉంచేయాలి.
- అలా 10 నిమిషాలు పెట్టడం ద్వారా కొబ్బరిలోని ప్లేవర్ అంతా రవ్వకి పట్టుకుంటుంది.
- ఈ 10 నిమిషాల బ్రేక్ సమయంలో.. ఒక కప్పు చక్కెర (రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో.. ఆ కప్పుతోనే) తీసుకుని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి
- ఆ తర్వాత బౌల్‌లోని రవ్వలో తొలుత ఆ చక్కెరని.. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మిశ్రమాన్ని కలిపాలి. అలానే యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపాలి
- రవ్వతో అన్ని పదార్థాలు బాగా కలిసిపోయాయని నిర్ధారణకి వచ్చిన తర్వాత గోరు వెచ్చని పాలను రెండు స్పూన్లు వేసి తొలుత కలపాలి
- ఆ తర్వాత ఒక్కో స్కూన్ పాలను నెమ్మదిగా వేస్తూ ముద్దగా అయ్యే వరకూ రవ్వని బాగా కలపాలి (ఒకేసారి కప్పు పాలని పొరపాటున కూడా వేయకూడదు. ఒక్కోసారి అరకప్పు పాలు కూడా సరిపోవచ్చు)
- రవ్వ ముద్దగా అయిన తర్వాత అరచేతికి నెయ్యి రాసుకుని.. కొద్దిగా కొద్దిగా రవ్వని తీసుకుని లడ్డూలుగా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి
రుచికరమైన రవ్వ లడ్డు రెడీ.. ఇంకెందుకు ఆలస్యం ఈరోజే ప్రయత్నించి రవ్వ లడ్డు టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి.