18 ఏళ్లు పైబడిన భారత పౌరులు ఎవరైనా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు బ్యాంక్ డిఫాల్ట్ చరిత్ర ఉండకూడదు. రుణం పొందడానికి బ్యాంకు ఖాతా అవసరం. రుణం పొందేందుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్ల విషయానికి వస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బిజినెస్ ప్లాన్, కేవైసీ డాక్యుమెంట్, ఆదాయ రుజువు వంటి పత్రాలు ఉండాలి.