తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మంగా రుణమాఫీ స్కీమ్ ను పట్టాలెక్కించింది. 2018 నుంచి ఉన్న రూ. 31 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయించగా… ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేసింది. మిగతా రైతులు మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. వీరి రుణాలను కూడా మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.